తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా రూపొందాలి: దత్తాత్రేయ - చైతన్య విశ్వవిద్యాలయం ప్రారంభంలో బండారు దత్తాత్రేయ

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో చైతన్య విశ్వవిద్యాలయాన్ని... హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. భవిష్యత్​లో ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తయారుకావాలని ఆకాంక్షించారు.

himachal governor bandaru dathathreya attent to inaugural ceremony
ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా రూపొందాలి: దత్తాత్రేయ

By

Published : Sep 3, 2020, 5:25 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం-2020... చరిత్రలో నిలిచిపోనుందని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చైతన్య విశ్వవిద్యాలయాన్ని దృశ్య మాధ్యమంలో ప్రారంభించారు.

విద్యార్థుల భవిష్యత్​ దృష్ట్యా ఒక ప్రామాణిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని దత్తాత్రేయ సూచించారు. భవిష్యత్​ చైతన్య విశ్వవిద్యాలయం ఒక ప్రపంచ ర్యాంక్ గల విద్యాసంస్థగా రూపొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details