Medigadda Project Gates Lifted : కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 24 గేట్లు ఎత్తి... నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు.
కాళేశ్వరానికి జలపరవళ్లు.. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తిన అధికారులు - Medigadda Project Gates Lifted
Medigadda Project Gates Lifted : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు.. పరవళ్లు తొక్కుతున్నాయి.
![కాళేశ్వరానికి జలపరవళ్లు.. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తిన అధికారులు Medigadda Project Gates Lifted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15739898-133-15739898-1656999842859.jpg)
Medigadda Project Gates Lifted
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద.. మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తివేత
మేడిగడ్డ బ్యారేజీకి 60వేల530 క్యూసెక్కుల ప్రవాహం రాగా... 24 గేట్లు తెరిచి 62వేల 940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 9.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు... పరవళ్లు తొక్కుతున్నాయి.