రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరంలోని చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఉర్సు, రంగ సముద్రం మత్తడి పోయగా... కిల వరంగల్ రాతి కోటకు దిగువన ఉన్న అగర్తల ప్రమాదకరంగా మారింది. కుంట పూర్తిగా నిండుకుని రహదారిపై వరద నీరు చేరి... వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
ఎడతెరపి లేకుండా వర్షం.. జలమయమైన వరంగల్
వరంగల్లో కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైంది. ఇళ్లలోకి నీరి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి నీరు చేరి వాహనాలకు అంతరాయం కలిగింది. నగరంలోని చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి.
ఎడతెరపి లేకుండా వర్షం.. జలమయమైన వరంగల్
భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దేశాయిపేటలోని వీవర్స్ కాలనీ, మైసయ్య నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మధుర నగర్లో రహదారులపై నీరు చేరింది. సాకరాసి కుంటతోపాటు ఎస్సార్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. నాళాలు నిండిపోయాయి. నగర పాలక సంస్థ అధికారులు జేసీబీల సాయంతో హుటాహుటిన చర్యలు చేపట్టారు.