వరంగల్ నగరం జలమయమైంది. భారీగా కురిసిన వర్షంతో తడిసి ముద్దైంది. హన్మకొండ, ఖాజీపేట, వరంగల్లో జోరుగా పడిన వర్షంతో... రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. హన్మకొండ బస్టాండ్, జేఎన్ఎస్ మైదానం పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. దుకాణాల్లోకి భారీగా నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వర్షం నీటితో వరంగల్ నగరం జలదిగ్బంధం - rain in warangal city
వరంగల్ నగరంలో రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రోడ్లపై భారీగా చేరిన నీటితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వర్షం నీటితో వరంగల్ నగరం జలదిగ్బంధం