Harishrao Warangal Tour: వరంగల్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పర్యటించారు. సెంట్రల్ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను, నిర్మాణ నమూనాను మంత్రులు పరిశీలించారు. ప్రస్తుతం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని దసరా తర్వాత 2,500 కార్మికులతో నిర్మాణ పనులు చేయిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
'ఆస్పత్రి నిర్మాణం కోసం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం మరింత వేగంగా జరిగేందుకు చర్యలు. వర్షాలు తగ్గాకా 2,500 మంది కార్మికులతో నిర్మాణ పనులు. 24 అంతస్థుల భవనానికి అన్ని అనుమతులు తీసుకున్నాం. భవనంలో 16 అంతస్థులు ఆస్పత్రి నిర్మాణం. మిగిలిన 8 అంతస్థుల్లో వైద్యులకు వసతి, సెమినార్ హాళ్ల నిర్మాణం జరుగుతుంది.'-హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి