వరద ముప్పు నుంచి ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ముంపునకు గురైన కాలనీల్లో వరద నీరు క్రమక్రమంగా తగ్గుతోంది. వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల నిత్యావసర సరకులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బియ్యం చెడిపోయాయని కాలనీవాసులు వాపోయారు.
తడిసి ముద్దైన నిత్యావసర సరకులు, బట్టలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన... వరంగల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరకులు, బట్టలు తడిసి ముద్దయ్యాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
బట్టలు నీటిలో కొట్టుకుపోయాయని, తినడానికి బియ్యం కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ నుంచి వరద తగ్గినప్పటికీ... భారీ వర్షం కురిస్తే మళ్లీ యథాతథంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతుందన్నారు. నాలాలను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఇలాంటి దుస్థితి తలెత్తిందని ఆరోపించారు.