ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు.. విశ్వనాథ్ కాలనీలో 50 ఫీట్ల రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ ఇంటిని నేలమట్టం చేశారు. కేటీఆర్కు అదే కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో కూల్చేశారు. రహదారికి అడ్డంగా ఉన్న భవనాన్ని తొలగించడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కార్పొరేటర్ ఇల్లు నేలమట్టం - greater warangal municipal corporation updates
ఈటీవీ భారత్ కథనానికి వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు స్పందించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని విశ్వనాథ్ కాలనీలో 50 ఫీట్ల రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ ఇంటిని బల్దియా అధికారులు నేలమట్టం చేశారు.
![ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కార్పొరేటర్ ఇల్లు నేలమట్టం greater warangal municipal corporation officers action on etv bharat article](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9204613-1079-9204613-1602884145435.jpg)
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కార్పొరేటర్ ఇళ్లు నేలమట్టం
రహదారి ఆక్రమణకు గురవుతుందని అదే కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అధికారులు వచ్చారు. ఫిర్యాదుదారుడిని చంపుతానని కార్పొరేటర్ దామోదర్ యాదవ్ వారి ముందే భయపెట్టాడు. తాజాగా వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చొరవతో ఆ ఇల్లును నేలమట్టం చేశారు. మరో ఐదు ఇళ్లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇదీ చూడండి:తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్