గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వాన షమీమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి సంధ్యా రాణి సమక్షంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ముందుగా కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించారు. మేయర్‌గా ఎన్నికైన గుండు సుధారాణి.. వరంగల్ 29వ డివిజన్ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి విజయం సాధించారు.
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి - వరంగల్ జిల్లా వార్తలు
14:59 May 07
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి
సుధారాణి, షమీమ్ పేర్లను ప్రకటించిన మంత్రులు ఎర్రబెల్లి దాయకర్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిగేలా చూశారు. అసంతృప్తులకు తావులేకుండా అధిష్ఠానం ఆదేశాలు అమలయ్యేలా వ్యవహరించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు 48 డివిజన్లలో తెరాస విజయం సాధించింది. భాజపా 10, కాంగ్రెస్ నాలుగు డివిజన్‌లలో గెలుపొందింది. ఇతరులు నాలుగు చోట్ల సత్తాచాటారు.
ఇవీచూడండి:ఖమ్మం మేయర్‌గా నీరజ ప్రమాణస్వీకారం