ఈ చిత్రంలో.. గొడుగులను చూస్తుంటే సినిమా షూటింగ్ ఏదో జరుగుతున్నట్టు ఉంది కదూ. అలా అనుకుంటే మీరు భ్రమ పడినట్టే సుమా! ఈ గొడుగులన్నీ(Umbrella Distribution) పేద ప్రజలకు పంచేందుకు సిద్ధం చేస్తున్నారు.
Umbrella Distribution: వీధి వ్యాపారులకు ఉచితంగా గొడుగులు - warangal news
వానాకాలం వచ్చేసింది. గొడగు లేకుండా ఇంటి నుంచి బయటకువెళ్తే తడిసి ముద్దైపోవాల్సిందే. ఇక వీధివ్యాపారులు, కూరగాయలు విక్రయించేవారికి వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వారి సమస్యను అర్థం చేసుకున్న ఓ తెరాస నేత వరంగల్ నగరంలో ఉచితంగా గొడుగులు పంపిణీ(Umbrella Distribution) చేస్తున్నారు.
గొడుగులు, గొడుగుల పంపిణీ, వరంగల్లో గొడుగుల పంపిణీ
వరంగల్ నగరంలో వీధి వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు వర్షాకాలంలో పడే ఇబ్బందులను గమనించిన తెరాస నేత రాజనాల శ్రీహరి వారికి ఉచితంగా గొడుగులు పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీహరి తెలిపారు. మరో రెండు మూడ్రోజుల్లో ఈ గొడుగులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.