మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (kadiyam srihari) మండిపడ్డారు. తన ఆస్తులను కాపాడటం కోసమే ఆయన భాజపాలో చేరారని ఆరోపించారు. తెలంగాణకు భాజపా ఏమిచ్చిందని ప్రశ్నించారు. ఏం చూసి ఆ పార్టీలో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయయన్నారు. రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం భాజపాలో కనిపించడం లేదా అని నిలదీశారు.
kadiyam srihari : 'ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల భాజపాలో చేరారు' - ఈటలపై కడియం ఆగ్రహం
భాజపాలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి(kadiyam srihari) ధ్వజమెత్తారు. ఐదేళ్ల క్రితమే కేసీఆర్‌తో మనస్పర్థలొస్తే.. ఇప్పుడు ఆత్మాభిమానం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.
![kadiyam srihari : 'ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల భాజపాలో చేరారు' kadiyam srihari, kadiyam srihari on etela](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12139856-thumbnail-3x2-a.jpg)
కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం
వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ప్యాలెసులు కూడబెట్టుకున్న ఈటల(Etela Rajender).. ఐదేళ్ల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మనస్పర్థలొస్తే ఇప్పుడు ఆత్మాభిమానం గుర్తొచ్చిందా అని కడియం ప్రశ్నించారు. ఆరోపణలు రాక ముందే రాజీనామా చేసి ఉంటే కొంత విలువ ఉండేదని అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగితే రాష్ట్ర ప్రజలు ఒకటవుతారని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక బాహుబలి ముఖ్యమంత్రి కేసీఆరేనని కడియం(kadiyam srihari) పేర్కొన్నారు.
'ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల భాజపాలో చేరారు'
- ఇదీ చదవండి :'రూల్స్' పాటించమన్నందుకు డీలర్‌తో ఫైటింగ్