తెలంగాణ

telangana

ధర్మసాగర్ జలాశయంలో ఎమ్మెల్యే రాజయ్య చేపపిల్లల విడుదల

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్​ రిజర్వాయర్​లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లక్ష చేపపిల్లలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 90 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

By

Published : Sep 28, 2020, 6:25 PM IST

Published : Sep 28, 2020, 6:25 PM IST

fish release into dharmasagae reservoir at warangal by mla tatikonda rajaiah
ధర్మసాగర్ జలాశయంలో ఎమ్మెల్యే రాజయ్య చేపపిల్లల విడుదల

రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం దాదాపు 90 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్​ రిజర్వాయర్​లో సోమవారం లక్ష చేపపిల్లలను ఆయన విడుదల చేశారు. త్వరలోనే మరో 11 లక్షల 52 వేల చేపపిల్లలను వదులుతామని ఎమ్మెల్యే తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తాటికొండ రాజయ్య అన్నారు.

ఇదీ చదవండిఃమత్స్యకారులకు చిక్కిన అరుదైన గోల్డ్​ఫిష్​

ABOUT THE AUTHOR

...view details