ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఎఫ్ఎం, వరంగల్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్ నుంచి జూ పార్క్ వరకు జరిగిన ర్యాలీని వరంగల్ సీపీ రవీందర్, జిల్లా అటవీ సంరక్షణ అధికారి అక్బర్ జెండా ఊపి ప్రారంభించారు. మన జీవ జాతులను, పర్యావరణాన్ని రక్షిస్తూ భూమిని కాపాడుకోవాలని రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
ఈ ఎఫ్ఎం ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ - warangal
ధరిత్రి దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ ఎఫ్ఎం, జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
పర్యావరణ అవగాహన ర్యాలీ