ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అర్చకులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
మహిషాసుర మర్దినిగా ఓరుగల్లు భద్రకాళి దర్శనం - warangal bhadrakali temple updates
వరంగల్లో భద్రకాళి అమ్మవారు నేడు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
మహిషాసుర మర్దినిగా ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు
భద్రకాళి మాతను మహిషాసుర మర్దినిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
Last Updated : Oct 24, 2020, 3:33 PM IST