హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
హన్మకొండలో న్యాయవాదుల ఆందోళన - న్యాయవాద దంపతుల హత్యకు వ్యతిరేకంగా నిరసన
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయవాది దంపతులను పట్టపగలే హత్యచేయడం దారణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు.
![హన్మకొండలో న్యాయవాదుల ఆందోళన district lawyers protest in hanmakonda against vamanrao couple murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10674265-206-10674265-1613630063830.jpg)
న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా హన్మకొండలో ఆందోళన
పట్టపగలే అందరూ చూస్తుండగా హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా కోర్టు నుంచి అమరవీరుల స్థూపం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన