ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప సరస్సు జలకళను సంతరించుకుంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ 2, మొదటి పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేశారు. రెండో ట్రైల్ రన్ ద్వారా పూర్తి టెక్నికల్ సమస్యలు పరిష్కరించేందుకు రెండు రోజుల నుంచి నిరంతరంగా నీటిని దిగువకు వదులుతున్నారు.
రామప్ప సరస్సుకు జలకళ - devadhula project news
ములుగు జిల్లాలోని రామప్ప సరస్సు జలకళతో ఉట్టిపడుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ రెండులో ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు.
రామప్ప సరస్సుకు జలకళ
రామప్ప సరస్సులోకి వెళ్లే నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ, నీటి సవ్వడులను చిత్రీకరిస్తూ మురిసిపోతున్నారు. నీటి ప్రవాహంలో వస్తున్న చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు ప్రయత్నాలు చేస్తున్నారు.