తెలంగాణ

telangana

ETV Bharat / city

వృద్ధురాలికి భూపాలపల్లి కలెక్టర్ చేయూత - bhupalapally latest news

పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం అంతా బిజీబిజీగా ఉన్నారు. రెండేళ్ల నుంచి పింఛన్‌ రావడం లేదని కలెక్టర్‌ను కలిసి విన్నవించుకుందామని కలెక్టరేట్‌ మెట్లపై వేచి చూస్తోంది ఓ వృద్ధురాలు. అప్పుడే పట్టణ ప్రగతి కార్యక్రమం నుంచి వచ్చిన కలెక్టర్‌.. కార్యాలయ మెట్లపైనే సమస్య పరిష్కరించారు.

COLLECTOR HELPED TO OLD LADY
వృద్ధురాలికి భూపాలపల్లి కలెక్టర్ చేయూత

By

Published : Feb 26, 2020, 7:50 PM IST

Updated : Feb 27, 2020, 11:27 PM IST

భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ అజ్మీర మంగమ్మ(70)కు గత రెండేళ్లగా పింఛన్ రాక ఇబ్బంది పడుతోంది. జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వచ్చి కార్యాలయ మెట్లపై కూర్చుని.. కలెక్టర్‌ కోసం వేచి చూడసాగింది. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగించుకుని అప్పుడే వచ్చిన కలెక్టర్.. వృద్దురాలు గమనించాడు. వెళ్లి ఆమె పక్కన మెట్లపై కూర్చుని ఎందుకు వచ్చినావని ఆప్యాయంగా పలకరించాడు.

చాలా ఇబ్బందిగా ఉంది..

"నాకు రెండు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ సారును కలిసి పెన్షన్ గురించి చెప్పుకుందామని వచ్చినా" అని చెప్పింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజీం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్‌లో మాట్లాడి వృద్దురాలికి వెంటనే పింఛన్ మంజూరు చేయించారు.

వృద్ధురాలికి భూపాలపల్లి కలెక్టర్ చేయూత

ఇవీ చూడండి: లైవ్​ వీడియో: బైక్, కార్​పైకి దూసుకెళ్లిన ఉల్లి లారీ

Last Updated : Feb 27, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details