'విద్యార్థులను సన్మానించిన వరంగల్ గ్రామీణ కలెక్టర్' - 100 percent marks
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 శాతం జీపీఏ సాధించిన 14 మంది విద్యార్థులను వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ సన్మానించారు.

సన్మానించిన వరంగల్ గ్రామీణ కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో సర్కారు పాఠశాలలో చదివి 10 శాతం జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సాహించేందుకు హన్మకొండ కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 100 శాతం మార్కులు తెచ్చుకున్న వారికి పది వేల రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.
సన్మానించిన వరంగల్ గ్రామీణ కలెక్టర్