తెలంగాణ

telangana

ETV Bharat / city

ద‌స‌రా రోజున రైతు వేదిక‌ల‌‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ తాజా వార్తలు

CM KCR will inaugurate the farmer forums on Dussehra says Minister Errabelli
ద‌స‌రా రోజున రైతు వేదిక‌ల‌‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Oct 11, 2020, 8:54 PM IST

Updated : Oct 11, 2020, 9:48 PM IST

20:52 October 11

ద‌స‌రా రోజున రైతు వేదిక‌ల‌‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్​ చేతులమీదుగా విజయ దశమి రోజున రైతు వేదికలు ప్రారంభమవుతాయని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వెల్ల‌డించారు. సీఎం వెస‌ులుబాటుని బ‌ట్టి ఏదో ఒక చోటు నుంచి ప్రారంభోత్స‌వం ఉంటుంద‌న్నారు. వ‌రంగ‌ల్​లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన మంత్రి.. రైతు వేదికల ప్రారంభోత్సవాలపై ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. 

దసరా నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక‌ల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్ది, ప్రారంభోత్స‌వాల‌కు సిద్ధం చేయాల‌ని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.572 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదిక‌ల‌ను ప్ర‌భుత్వం నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 74 రైతు వేదిక‌లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.  

ఇవీచూడండి: 'మారుమూల ప్రాంతాల రైతులు సైతం నేరుగా సీఎం​తో మాట్లాడొచ్చు'

Last Updated : Oct 11, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details