వరంగల్ కేంద్ర కారాగారాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. జైలులోని ఖైదీలతో సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు, స్టీల్ ఉత్పత్తులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడిన సీఎం కేసీఆర్... జైలులో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట - వరంగల్లో సీఎం కేసీఆర్ పర్యటన
వరంగల్లో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి... కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఖైదీలలో కాసేపు ముచ్చటించారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.

cm kcr visited central jail in warangal
సెంట్రల్ జైలును సందర్శించిన సీఎం... ఖైదీలతో కాసేపు ముచ్చట
అంతకుముందు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ముఖ్యమంత్రి సందర్శించారు. ఆస్పత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులు పరిశీలించిన సీఎం చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడారు. యోగక్షేమాలు, అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్న కేసీఆర్.. రోగుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు.