KCR Hanamakonda tour: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... ఒక రోజు పర్యటనకు కోసం... వరంగల్ జిల్లాకు విచ్చేయనున్నారు. ములుగు రోడ్డులో దామెర క్రాస్ రోడ్డు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 350 పడకలతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి సీఎం రోడ్డు మార్గంలో... వరంగల్‌కు విచ్చేస్తారు. 11.15 గంటలకు ఆసుపత్రిని, వైద్యకళాశాలను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. అధునాతన వసతులతో నిర్మించే ఈ ఆసుపత్రి ద్వారా...వరంగల్ పరిసర ప్రాంతాల వారికి చక్కని వైద్య సేవలందుతాయని తెలిపారు.
వరంగల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - సీఎం కేసీఆర్ పర్యటన
KCR Hanamakonda tour: హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వరంగల్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌కు వెళ్లారు. వరంగల్‌లో దామెర క్రాస్‌రోడ్డులో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్
అధికారికంగా ఖరారు కాకపోయినా.... వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకునే అవకాశాలున్నాయి. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఉన్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని సీఎం...హైదరాబాద్ బయలు దేరి వెళతారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 1, 2022, 11:29 AM IST