తెలంగాణ

telangana

ETV Bharat / city

చేనేత కళలు అద్భుతం: నటి పూనమ్​ కౌర్ - కొత్తవాడలో చేనేత కార్మికులతో సినీ నటి పూనమ్ కౌర్

కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సినీ నటి పూనమ్​ కౌర్ తెలిపారు. కొత్తవాడలో చేనేత కార్మికులతో ఆమె ముచ్చటించారు. వారి ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.

cine-actress-punam-kaur-request-to-protect-handicrafts
చేనేత కళలు అద్భుతం: నటి పూనమ్​ కౌర్

By

Published : Feb 18, 2021, 10:19 AM IST

కొత్తవాడలో సినీ నటి పూనమ్ కౌర్

చేనేత కార్మికుల ప్రతిభ అద్భుతమని సినీ నటి పూనమ్​ కౌర్ కొనియాడారు. వరంగల్ అర్బన్ జిల్లా కొత్తవాడలో ఆమె పర్యటించారు. అక్కడి స్థితిగతులను పరిశీలించారు. వారితో మమేకమయ్యారు. సమస్యల గురించి ఆరా తీశారు.

ఓహో.. చీరను ఇలా నేస్తారా?

కులవృత్తులను కాపాడుకుందాం...

కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పూనమ్ తెలిపారు. అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. కులవృత్తులను రక్షించుకుంటేనే.. దేశ భవిష్యత్తు భద్రమని చెప్పారు.

దేశానికి వెన్నెముకైన కులవృత్తులను కాపాడుకోవాలి: పూనమ్​ కౌర్

చేనేత కళకారులు రూపొందించిన చీరలను ఆమె సందర్శించారు.దరీలపై మహాత్మాగాంధీ, రుద్రమదేవి చిత్రాలను చూసి మంత్రముగ్దులయ్యారు. జాతిపిత గాంధీ చిత్రంతో రూపొందించిన దరీని ఆమె కొనుగోలు చేశారు. కొత్తవాడ పర్యటన తనకెప్పటికీ గుర్తుండిపోతుందని పూనమ్ చెప్పారు.

ఇదీ చూడండి:మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details