వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓం శ్రీ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృమూర్తులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు తమ చిన్నారులు పాదపూజ చేశారు. చిన్నప్పటినుంచే పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారని నిర్వాహకులు సంతోష్ రెడ్డి తెలిపారు.
మాతృమూర్తుల పాదపూజలో తరించిన చిన్నారులు - hanmakonda news
లోకంలో ప్రతి ఒక్కరికి కన్న తల్లిదండ్రులే కనిపించే దైవాలు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓం శ్రీ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లులకు పాద పూజ చేస్తూ చిన్నారులు తరించిపోయారు.
![మాతృమూర్తుల పాదపూజలో తరించిన చిన్నారులు children worshipped their parents in hanamkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10740544-588-10740544-1614062105223.jpg)
children worshipped their parents in hanamkonda
పిల్లలు తమ మీద ప్రేమ, గౌరవం, భక్తితో పాద పూజ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులు పాద పూజ చేస్తున్న క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.