హన్మకొండకు చెందిన కాముని మౌనిక ఎంబీఏ పూర్తి చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సాయం అందించాల్సిందిగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన వినయ్‌భాస్కర్ యువతికి స్వయం ఉపాధి కల్పించడం మేలని భావించి విజయ డైరీ ప్రొడక్ట్స్ స్టాల్ ఏర్పాటు చేయించారు.
ఎమ్మెల్యే దాతృత్వం... యువతికి డైరీ స్టాల్ పెట్టించిన చీఫ్ విప్ - mla help to women
సాయం కోరి వచ్చిన యువతికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కొండంత భరోసా ఇచ్చారు. నూతనంగా నిర్మించిన స్ట్రీట్ వెండింగ్ జోన్లో సొంత ఖర్చుతో విజయ డైరీ స్టాల్‌ని ఏర్పాటు చేయించారు.
chief Vip vinay bhasker helped to women
స్టాల్ ఏర్పాటుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వినయ భాస్కర్ వ్యక్తిగతంగా అందజేశారు. గాంధీ జయంతి సందర్భంగా మెఫ్మా ఆధ్వర్యంలో హన్మకొండలో ప్రారంభించిన స్ట్రీట్ వెండింగ్ జోన్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా స్టాల్‌ను ప్రారంభింపజేశారు. వినయ్ భాస్కర్ అందించిన చేయూతకు మౌనిక ధన్యవాదాలు తెలిపింది.