కరోనా వైరస్‌పై చిన్నారులకు బొమ్మల పుస్తకం ఆలోచన.. అవగాహన..ఆచరణ.. ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. చిన్నారుల్లో ఏదైనా ఆలోచన మొలకెత్తి.. అది ఆచరణ దశకి చేరాలంటే.. బొమ్మల రూపంలో చెబితే సులువుగా వారి బుర్రకెక్కుతుంది. ఈ విషయాన్ని గుర్తించింది చండీగఢ్‌లోని స్నాతకోత్తర వైద్య విద్య పరిశోధన సంస్థ (పీజీఐఎంఈఆర్).
అందులో ఏముందంటే..?
ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పైన చిన్నారులకు టూకీగా వివరించే ప్రయత్నం చేసింది. 22 పేజీల్లో.. చిన్న ఆంగ్లవాక్యాలతో.. రంగుల బొమ్మల పుస్తకం అందుబాటులోకి తెచ్చింది. హిమాలయ పర్వత ప్రాంతంలో పుట్టిన హీరో ‘వాయు’. కరోనా అంటే ఏమిటో తెలియక సతమతమయ్యే విద్యార్థులకు ఆపద్బాంధవుడిలా ప్రత్యక్షమవుతాడు. వైరస్ ఎలా వ్యాపిస్తుంది? దాని నివారణ చర్యలేంటి? ఎలా నడుచుకోవాలి? అని అర్థమయ్యేలా చెబుతాడు. విద్యార్థులు సంతృప్తితో ఊపిరి పీల్చుకుంటారు. అంతర్జాలంలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. ఆసక్తిగలిగిన వారెవరయినా చదువుకోవచ్చు.
ప్రధానంగా 12 ఏళ్ల లోపు చిన్నారుల కోసమే పుస్తకాన్ని రూపొందించామంటున్నారు విద్యా విజ్ఞాన సంస్థ పర్యావరణ ఆరోగ్య విభాగం అదనపు ఆచార్యుడు డాక్టర్ రవీంద్ర ఖైవాల్, పంజాబ్ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర అధ్యయన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ మోర్ ముందు మాటలో..