మినీ పురపోరు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎండను, కరోనా వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా ప్రధాన పార్టీల నేతలు ప్రచారం నిర్వహించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ముగిసిన మినీ పురపోరు ఎన్నికల ప్రచారం... 30న పోలింగ్ - mini municipal elections updates
రాష్ట్రంలో మినీ పురపోరుకు సంబంధించి ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరిగా చేసిన ప్రచారానికి తెరపడింది. విమర్శలు, ప్రతివిమర్శలతో మారుమోగిన మైకులు బందయ్యాయి. ఎండను, కరోనా వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా పార్టీ నేతలు ప్రచారం చేశారు.
campaigning closed in mini municipal elections
ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 3న కార్పొరేషన్లు, పురపాలికల్లో ఓట్లు లెక్కించనున్నారు.