తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: మాస్కులు కట్టుకొని మనువాడారు! - bride And Groom Wear Mask In marriage In Mahabubabad

పెళ్లంటే నూరేళ్ల పంట... ఆకాశమంత పందిరి... మేళతాళాలు.. భాజాభజంత్రీలు.. ఇవి మాత్రమే కాదు.. ఇప్పుడు పెళ్లంటే.. మాస్కులు కూడా ఉండాల్సిందే.

bride And Groom Wear Mask In marriage In Mahabubabad
మాస్కులు కట్టుకొని మనువాడారు!

By

Published : Mar 16, 2020, 11:48 PM IST

మాస్కులు కట్టుకొని మనువాడారు!

ఏ నలుగురు ఒకచోట చేరినా కరోనా భయంతో దూరదూరంగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. షేక్​హ్యాండ్​కి బదులు.. సంస్కారంగా నమస్కారం పెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అయితే.. ఓ పెళ్లి వేడుకలో వధువు, వరుడు, బంధువులు, అతిథులు కరోనా భయంతో మాస్కులు వేసుకొని కన్పించారు. పురోహితుడు సైతం మాస్క్ ధరించి వేదమంత్రాలు చదివాడు. పందిట్లో.. పెళ్లి సందట్లో.. పట్టు చీరలు, నగలు, ఆడంబరాలతో పాటు.. మాస్కులు కూడా సందడి చేశాయి.

ఇదీ చూడండి : పాండవుల గుట్టల్లో కలెక్టర్ రాక్ క్లైంబింగ్

ABOUT THE AUTHOR

...view details