వరంగల్ అర్బన్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, పిడుగుపాటులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ధర్మసాగర్ మండలంలోని రాపాకపల్లిలో పిడుగు పడి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. పిడుగు పడిన సమయంలో గుడిసెలో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వారు స్పందించి గుడిసెకు దగ్గరలో వున్న వాహనాలు, ఇతర వస్తువులను దూరంగా తీసుకెళ్ళారు. వరంగల్ హంటర్ రోడ్డు రహదారి పక్కన పిడుగుపడి ఒక తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. రహదారి పక్కనే తాటిచెట్టు కాలిపోతుండడంతో రోడ్డుపై వాహనదారులు గుమిగూడారు. భీకర గాలులకు పూరిళ్ల కప్పులు ఎగిరిపోయాయి.
వరంగల్ పట్టణంపై పిడుగుల వర్షం - undefined
శుక్రవారం రాత్రి కురిసిన వర్షం వరంగల్ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రచండ గాలులు, ఉరుములు, పిడుగులు నగర ప్రజల్ని వణికించేశాయి. చాలా పూరిళ్లకు కప్పులు ఎగిరిపోయాయి.
వరంగల్లో బీభత్సం సృష్టించిన గాలివాన