రాష్ట్ర అభివృద్ధిని మరచిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణకు ఖల్ నాయక్‌లా మారారని భాజాపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. దోపీడీయే బంగారు తెలంగాణకు రూట్ మ్యాప్ అయ్యిందని ఆక్షేపించారు. వరంగల్‌లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం తదితర కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.
'అభివృద్ధికి కాదు... ఆ పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకం' - వరంగల్‌లో భాజపా నాయకుల సమావేశం
వరంగల్‌లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం తదితర కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని... ఆ పేరుతో జరిగే దోపిడీని మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని భాజపా నేతలు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భాజాపా శక్తివంతంగా తయారవడం చూసి ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని...బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని... ఆ పేరుతో జరిగే దోపిడీని మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. పార్లమెంటు సమావేశాలు.. ఇతర కార్యక్రమాలు ఉన్నందున పార్టీ తలపెట్టిన బస్సు యాత్రను ప్రస్తుతానికి జరపట్లేదని బండి సంజయ్ తెలిపారు.
గిరిజన వర్సిటీతో సహా ఇతర ప్రాజెక్టులకు రాష్ట్రం భూకేటాయింపులు జరపకపోవడం వల్లే ఆలస్యమవుతోందని సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డీపీఆర్ ఇవ్వమంటే.. ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఉంటేనే... కేంద్ర నిధులు సక్రమంగా ఖర్చవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్ కార్పోరేషన్ కైవసం చేసుకుంటామని... మేయర్ పీఠం తమదేనని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేశారు.