వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. దీక్షా దివస్ పైలాన్ తొలగించాలంటూ పోడియం వద్ద భాజపాకి చెందిన కార్పొరేటర్ చాడ స్వాతి బైఠాయించారు. భాజపా కార్పొరేటర్ వైఖరిని తప్పుబడుతూ తెరాస కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వరంగల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస - తెలంగాణ వార్తలు
వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షా దివస్ పైలాన్ తొలగించాలంటూ భాజపా కార్పొరేటర్ చాడ స్వాతి డిమాండ్ చేశారు. ఆమె వైఖరిని తప్పుబడుతూ తెరాస కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వరంగల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
ఎమ్మెల్యే బస్వారాజు సారయ్య కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భాజపా నాయకులు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయగా... సమావేశ మందిరం నుంచి భాజపా కార్పొరేటర్ వెనుదిరిగారు.
ఇదీ చదవండి:దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు: కేటీఆర్
Last Updated : Feb 8, 2021, 3:41 PM IST
TAGGED:
warangal urban district news