తెలంగాణ

telangana

ETV Bharat / city

బర్డ్ ఫ్లూ కలకలం: అప్రమత్తమైన కాకతీయ జూ అధికారులు - Telangana latest news

బర్డ్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న వేళ వరంగల్ జూ అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పక్షులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారు.

Bird flu outbreak: Vigilant Kakatiya zoo officials in Warangal
బర్డ్ ఫ్లూ కలకలం: అప్రమత్తమైన కాకతీయ జూ అధికారులు

By

Published : Jan 9, 2021, 2:47 AM IST

కొవిడ్ వైరస్ కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న ఈ సమయంలోనే... తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ కూడా అంతే ఆందోళనకు గురి చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వైరస్ కలకలం రేపుతోంది. మనరాష్ట్రంలో మాత్రం ఇంకా దీని ఆనవాళ్లు లేకపోవడం ఊరట కలిగించే విషయమే. వరంగల్ కాకతీయ జూ పార్క్​లో బర్డ్ ఫ్లూ రాకుండా అధికారులు సిబ్బంది అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందమైన రామచిలుకలు.. నెమళ్లు, అడవి పక్షులు ఇలా 29 రకాల రెండు వందల పక్షులు సందర్శకులను ఎక్కువుగా ఆకర్షిస్తుంటాయి. ఈ పక్షులను జూ అధికారులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తూనే యాంటీ వైరల్ మందులు అందిస్తున్నారు. పరిసరాల్లో బ్యాక్టీరియా,వైరస్‌ వ్యాపించకుండా బ్లీచింగ్ సున్నం చల్లుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన జూ అధికారి హకీం పక్షులను పరిశీలించి కొన్ని జాగ్రత్తలు సూచించారు.

ఇవీ చూడండి:ఆందోళన వద్దు - ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్ ఫ్లూ!

ABOUT THE AUTHOR

...view details