తెలంగాణ

telangana

ETV Bharat / city

లక్ష మల్లెపూలతో భద్రకాళీ అమ్మవారికి పూజలు - bhadrali-temple

వరంగల్​ భద్రకాళీ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారికి లక్ష మల్లెపూలతో పుష్పార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

భద్రకాళీ అమ్మవారికి పూజలు

By

Published : Apr 7, 2019, 12:47 PM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు లక్ష మల్లెపూలతో అమ్మవారికి మల్లికా పుష్పార్చన నిర్వహించారు. పూలతో కాళీమాతను కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు.

ఆదివారం అయినందున దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

భద్రకాళీ అమ్మవారికి పూజలు

ఇదీ చదవండిః మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఇంట్లో సోదాలు

ABOUT THE AUTHOR

...view details