అయ్యప్ప శరణు ఘోషతో ఓరుగల్లు నగరం మారుమోగింది. కాశిబుగ్గలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన పడిపూజా మహోత్సవంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. శ్రీకాంత్ గురుస్వామి నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో మణికంఠునికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
శరణు ఘోషతో మారుమోగిన ఓరుగల్లు - కాశీబుగ్గలో అయ్యప్ప పడిపూజ
వరంగల్ కాశిబుగ్గలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజా మహోత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వాములు వేసిన పేటైతుల్లి అందరినీ ఆకట్టుకుంది.
ayyappa padi pooja in kasibugga temple
తీరొక్క పూలతో అలంకార ప్రియున్ని అందంగా ముస్తాబుచేశారు. భక్తుల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శబరి గిరీశున్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భజన కీర్తనలతో పరవశించి అయ్యప్ప స్వాములు వేసిన పేటైతుల్లి అందరినీ ఆకట్టుకుంది.