తెలంగాణ

telangana

ETV Bharat / city

బండి సంజయ్‌ పాదయాత్రలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

Bandi Sanjay padayatra బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరుప్పులలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జనగామ జిల్లాలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Aug 15, 2022, 12:46 PM IST

Updated : Aug 15, 2022, 1:29 PM IST

బండి సంజయ్‌ పాదయాత్రలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

Bandi Sanjay padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతుండగా భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది తెరాస కార్యకర్తలు.. భాజపా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెరాస కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 15, 2022, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details