తెలంగాణ

telangana

ETV Bharat / city

మృతదేహంతో పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళన

ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడిని అరెస్ట్​ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పొనుగోడులో జరిగింది.

మృతదేహంతో ధర్నా

By

Published : Mar 29, 2019, 1:14 AM IST

మృతదేహంతో ధర్నా
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన నందిని.. బుధవారం పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. తమ కూతురి ఆత్మహత్యకు ప్రేమికుడే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహంతో పోలీస్​ స్టేషన్​ ఎదుట బైఠాయించారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వచ్చి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details