.
రాజన్న సల్లంగ చూడు - vemulwada_rush for sivaratri
వేములవాడ రాజన్న ఆలయ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. రాజన్న దర్శనం కోసం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగుతోంది.
మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు , అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు.
రాత్రి నుంచే వేచిచూస్తున్నారు
రాజన్న దర్శనానికి రాత్రి నుంచే అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 4గంటల సమయం పడుతుంది. భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటూ తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష స్వాముల దర్శనం, రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది.
ఇదీ చదవండిఃశివ 'ఆరాధన'