తెలంగాణ

telangana

ETV Bharat / city

'వడగండ్లకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం' - icerain

సోమవారం రాత్రి కురిసిన వడగండ్లవానకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే హరీశ్​రావు... నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సిద్దిపేట హరీశ్​​రావు పర్యటన

By

Published : Apr 9, 2019, 10:12 AM IST

సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లాలో పడిన వడగండ్ల వానకు పంటలు, మామిడి తోటలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని నంగునూరు మండలంలోని పలు గ్రామాల్ని ఎమ్మెల్యే హరీశ్​రావు పర్యటించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హరీశ్​రావు భరోసా ఇచ్చారు. నష్టంపై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ బాధపడవద్దని... అందరికీ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సిద్దిపేట హరీశ్​​రావు పర్యటన

ABOUT THE AUTHOR

...view details