లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డికి సంబంధించిన సామగ్రిని స్థానిక అంబేడ్కర్ మైదానంలో పంపిణీ చేశారు. అధికారులు, పోలీసులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నియోజకవర్గంలో 280 పోలింగ్ కేంద్రాలకు 1700 మంది సిబ్బందిని నియమించినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీను తెలిపారు. అదనంగా మరో పది శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.
ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైన సంగారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 280 కేంద్రాలకు 1700 మంది సిబ్బందిని నియమించినట్లు ఏఆర్వో శ్రీను తెలిపారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ