సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు వేతనాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని అంటూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేతనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన మున్సిపల్ కమిషనర్ వేమనా రెడ్డి రెండు నెలల వేతనాలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం చివరినెల అయినందున వేతనాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. మరో రెండు రోజుల్లో అందుతాయని హామీనిచ్చారు.
ఈనెల 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.
'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం' - undefined
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈనెల 10లోపు వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అమీన్పూర్లో ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులు
అమీన్పూర్లో ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులు
ఇవీ చూడండి:దేశమంతా ఓ ఎత్తు... నిజామాబాద్ మరోఎత్తు...!
TAGGED:
municipal employees strike