తెలంగాణ

telangana

ETV Bharat / city

దొంగలందరూ ఒక్కటయ్యారు: రాజాసింగ్​ - bjp

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా దొంగలందరూ ఒక్కటయ్యారని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ కూడలి నుంచి బొల్లారం వరకు రోడ్​షో నిర్వహించారు.

మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో

By

Published : Mar 31, 2019, 4:59 PM IST

దేశం బాగుండాలంటే సరైన ప్రధాని అవసరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కూడలి నుంచి బొల్లారం వరకు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తి రఘునందన్ రావు అని ఆయనను గెలిపించుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నారు. దొంగలందరూ కలిసి మహా కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రధాని ఎవరు అవుతారో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి అరికట్టాలంటే భాజపాకు మద్దతివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details