సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం ముస్తాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు, కంటెయినర్ లారీ ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 20మందిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగిన వివాహానికి హాజరై స్వగ్రామానికి వెళ్తుండగా ముస్తాపూర్ వద్ద ఈ ప్రమాదం జరగింది.
వేడుక నుంచి వస్తుండగా విషాదం - sangareddy
వారంతా హైదరాబాద్లో తమ బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ముస్తాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మందికి గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
![వేడుక నుంచి వస్తుండగా విషాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2908132-thumbnail-3x2-vysh.jpg)
బస్, లారీ ఢీ... 40 మందికి గాయాలు
Last Updated : Apr 5, 2019, 7:52 PM IST