మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కందిలోని పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే రానుందని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా... ఇవ్వలేదని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు.
'రాష్ట్రానికి నిధులు ఇచ్చినా ఇవ్వలేదంటున్నారు' - elections 2019
లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుండగా... అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మెదక్ లోక్‌సభ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భాజపా ప్రచారం