పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పంచాలని డిమాండ్ చేస్తూ తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ప్లాంటు నిర్మాణ పనులను పరిశీలించటానికి వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌సుఖ్ లక్ష్మణ్‌భాయ్ మాంధవ్యాను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా... ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి... కేంద్రమంత్రులను కర్మాగారంలోకి పంపించారు.
కేంద్ర మంత్రుల పర్యటనను అడ్డుకున్న తెరాస శ్రేణులు
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌సుఖ్ లక్ష్మణ్‌భాయ్ మాంధవ్యాను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా... పోలీసులు ఇరు పార్టీ శ్రేణులను చెదరగొట్టారు. కేంద్ర మంత్రులను లోపలికి పంపించారు.
trs party activists stopped central ministers in ramagundam
ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గతంలో పలుమార్లు ప్లాంటు యాజమాన్యానికి, కేంద్రానికి విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేదని నేతలు మండిపడ్డారు. ఎనబై శాతం స్థానికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి... ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదని నేతలు దుయ్యబట్టారు.
ఇదీచూడండి:రామగుండం చేరుకున్న కేంద్రమంత్రులు
Last Updated : Sep 12, 2020, 4:51 PM IST