రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు త్వరలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ వినతిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగరేణి ఏరియాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలను సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లేఖ రాసింది.
సింగరేణి కార్మికులకు ఉచితంగా కరోనా టీకా - corona vaccine in telangana
సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కారు శుభవార్త వినిపించింది. కార్మికులందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి ఆస్పత్రులను సిద్దం చేయాలని సూచించింది.
telangana government decided to give corona vaccine to singareni employees for free
వ్యాక్సినేషన్ కోసం ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మంత శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం జరగుతున్న రెండో దశలో భాగంగా 45 ఏళ్లు దాటి... బీపీ, షుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతో పాటు కంపెనీ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి: 'పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదే'
TAGGED:
ఉచితంగా కరోనా టీకా