పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-1 ఏరియాలోని సింగరేణి గోదావరిఖని GDK-11 వ బొగ్గు గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడు కోడం సంజీవ్ అదృశ్యం మిస్టరీగా మారింది. మంగళవారం ఉదయం షిఫ్ట్ విధులకు హాజరైన సంజీవ్ సాయంత్రం నాలుగు గంటలకు పైకి చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటికే ఆయన ఆచూకీ దొరకలేదు.
రెస్క్యూ బృందాలతో అన్వేషణ..
సింగరేణి రెస్క్యూ బృందాలతో పాటు అధికారులు వేర్వేరుగా గనిలో అన్వేషించారు. సంజీవ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఓవర్‌మెన్‌తో మాట్లాడారు. మరో రెండు గంటలు అదనపు పని చేయాలనే సూచనతో అక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత రెండో షిఫ్టుకు హాజరైన కార్మికులు సంజీవ్ అదృశ్యమైనట్లు గుర్తించారు. అతడికి సంబంధించిన క్యాప్ ల్యాంపు రక్షణ దీపం ఎక్కడా కనిపించలేదు.