తెలంగాణ

telangana

ETV Bharat / city

'రామగుండం కార్పొరేషన్​ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం' - ramagundam municipal corporation

రామగుండం కార్పొరేషన్​ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పని చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ramagundam mla korukanti chandar l
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

By

Published : Oct 1, 2020, 8:05 PM IST

వర్షాకాలంలో ప్రజల ప్రయాణ అవస్థలు తొలగించడానికే నూతన రహదారి నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రూ.5 కోట్ల 60 లక్షలతో ఎఫ్​సీఐ క్రాస్​రోడ్డు నుంచి ఆర్​ఎఫ్​సీఎల్​ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల సమస్యలు పరిష్కరిస్తామని, కార్పొరేషన్​ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా పనులు చేస్తున్నామని కోరుకంటి చందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details