తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం.. సాంకేతిక లోపమే కారణం.. - ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం

Interruption of power generation: రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్​ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులు ప్రారంభించారు.

Interruption of power generation in NTPC 4th unit
Interruption of power generation in NTPC 4th unit

By

Published : Apr 5, 2022, 7:00 PM IST

Interruption of power generation: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం ఎన్టీపీసీ 4వ యూనిట్​లో 500 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్​లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులు ప్రారంభించారు.

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలోని 200 మెగావాట్ల సామర్థ్యం గల 1వ యూనిట్లో వార్షిక మరమ్మతులు కొనసాగుతుండగా.. మిగిలిన ఐదు యూనిట్లలో దాదాపు 1700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపంతో నిలిచిన 4వ యూనిట్​లో త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details