తెలంగాణ

telangana

ETV Bharat / city

వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: ఏసీపీ ఉమేందర్ - awareness program on helmet importance

పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్​ పోలీస్​ ఆధ్వర్యంలో పోలీస్​ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం శిరస్త్రానం ప్రాధాన్యతను వివరిస్తూ బైక్​ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏసీపీ ఉమేందర్​ ప్రారంభించారు.

bike rally on helment importance awareness  at godavarikhani
గోదావరిఖనిలో శిరస్త్రానం ప్రాధాన్యతను వివరిస్తూ బైక్​ ర్యాలీ

By

Published : Oct 22, 2020, 3:05 PM IST

శిరస్త్రానం ధరించి వాహనాలు నడపాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్​ పోలీస్​ ఆధ్వర్యంలో పోలీస్ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్మెట్​ అవగాహన బైక్ ర్యాలీను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏసీపీతో పాటు పోలీసులు, యువకులు బైకులకు ప్లకార్డులు ఏర్పాటు చేసుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.

ర్యాలీను ప్రారంభిస్తున్న ఏసీపీ ఉమేందర్

ర్యాలీ చేస్తున్న సమయంలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు శిరస్త్రానం అవసరంపై అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్​ ధరించి వాహనాలు నడపాలని ఏసీపీ ఉమేందర్​ సూచించారు. శిరస్త్రానం ధరించడం వల్ల వాహనదారులతో పాటు మిగతావారి ప్రాణాలనూ కాపాడిన వారవుతారని ఉమేందర్​ అన్నారు.

ఇదీ చదవండిఃహెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు

ABOUT THE AUTHOR

...view details