నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నిన్న ఉదయం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. తిరిగి ఈ ఉదయం స్వల్ప వరద రావడంతో గేట్లు ఎత్తారు.
శ్రీరాంసాగర్‌కు మళ్లీ వరద.. 4 గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఈరోజు ఉదయం నుంచి మళ్లీ వరద ప్రారంభమైంది. ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో 4 గేట్లు ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
శ్రీరాంసాగర్‌కు మళ్లీ వరద.. 4 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతం నుంచి 25,208 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది. కాకతీయ కాలువ ద్వారా 6,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి:పెద్దచెరువులో పడి యువకుడు మృతి.. మరొకరు గల్లంతు
Last Updated : Oct 5, 2020, 4:21 PM IST