తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్​ఆర్​ఎస్పీకి స్వల్ప వరద.. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల - srsp updates

ఎస్​ఆర్​ఎస్పీకి 25,359 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 4 గేట్లు తెరిచి 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప వరద వస్తోంది.

sriram sagar project four gates open
ఎస్​ఆర్​ఎస్పీకి స్వల్ప వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Oct 27, 2020, 3:15 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు తెరిచి 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 25,359 క్యూసెక్కుల స్వల్ప వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3,000, వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నామని రిజర్వాయర్ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details