నిజామాబాద్ జిల్లాలో రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 లక్షల 90వేల 687 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నారు. ఇందుకు గానూ.. జిల్లాలో 390 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభం కానుంది.
నిజామాబాద్లో ప్రారంభమైన రెండో విడత రేషన్ పంపిణీ - Second Phase Free Ration Distribution Starts In Nizamabad
లాక్డౌన్ సమయంలో ప్రజలు తిండికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం పంపిణీ చేసింది. నిజామాబాద్లో రెండో విడత కూడా పేదలకు బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించింది.
![నిజామాబాద్లో ప్రారంభమైన రెండో విడత రేషన్ పంపిణీ Second Phase Free Ration Distribution Starts In Nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7030369-303-7030369-1588417336043.jpg)
నిజామాబాద్లో ప్రారంభమైన రెండో విడత రేషన్ పంపిణీ